Site icon NTV Telugu

Sasana Sabha: ఎమ్మెల్యే నారాయణస్వామిగా రాజేంద్రప్రసాద్

Rajendra Prasad Sasanasabha

Rajendra Prasad Sasanasabha

Rajendra Prasad Playing MLA Narayana Swamy Role In Sasanasabha: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘శాసనసభ’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. చిత్రం కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది” అని అన్నారు.

Exit mobile version