NTV Telugu Site icon

Shekar: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన యాంగ్రీ యంగ్ మ్యాన్

Shekar

Shekar

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్  జోసెఫ్‌ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.  జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.  ఇప్పటికే  ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

మే 20వ తేదిన శేఖర్  సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాతో హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి మే లో స్టార్ హీరో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాల మధ్యలో శేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.