సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తాజాగా వచ్చిన సినిమా ‘బైకర్’. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ మోటో క్రాస్ బైక్ రేసింగ్ కోచ్‌గా, శర్వానంద్ తండ్రిగా కనిపించారు. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్‌ను నిన్న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా చేయడం తనకు చాలా తృప్తిని ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు తన బంధువులు కూడా తనను ‘తాత’ అని పిలవలేదని, కానీ ఈ సినిమా కోసం ఒక సీన్‌లో మనవడి పాత్రధారి వచ్చి ‘తాత’ అంటే మొదట వింతగా అనిపించిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read:Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం
అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో ఒక ప్రతినిధి.. “సోషల్ మీడియాలో మీ గురించి ‘రాజశేఖర్ గోళీల ఫ్యాక్టరీ’ అని బాగా వైరల్ అయింది, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ‘బైక్ ఫ్యాక్టరీ’ అంటారేమో” అని సరదాగా వ్యాఖ్యానించారు. దానికి రాజశేఖర్ అంతే సరదాగా స్పందిస్తూ, ఏది వచ్చినా ఏది పోయినా తాను మాత్రం ఆ ‘గోళీల ఫ్యాక్టరీ’ పేరును వదిలేది లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాజశేఖర్‌కు ఒక గోళీల ఫ్యాక్టరీ ఉందని, దాని ద్వారా ఆయనకు కోట్ల రూపాయల లాభం వస్తుందని గతంలో ఒక వీడియో వైరల్ అయింది. అయితే తనకు ఎలాంటి గోళీల ఫ్యాక్టరీ లేదని రాజశేఖర్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
