Rajasekher: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా అంటే.. థియేటర్లు ఖాళీగా ఉండేవి కావు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప వేరే క్యారెక్టర్ చేసింది లేదు. ఇక చివరిగా రాజశేఖర్.. శేఖర్ అనే సినిమాలో నటించాడు. ఆ తరువాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రాజశేఖర్ .. ఒక కుర్ర హీరో చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలనాటి స్టార్ హీరోలందరూ.. ఇప్పుడు కుర్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలుగానో.. విలన్స్ గానో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు రాజశేఖర్.. ఇలా ఎంట్రీ ఇవ్వలేదు కానీ, ఇక నుంచి కీలక పాత్రల్లో నటించడానికి సిద్దమయ్యాడని తెలుస్తోంది.
Leo: అనిరుధ్.. ఈసారి మ్యాజిక్ చేసినట్లు కనిపించడం లేదే..
టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసింది. డిసెంబర్ 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కాకుండా నితిన్ తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే సీనియర్ నటి లయ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నాడట. బలమైన పాత్ర కావడంతో యాంగ్రీ మ్యాన్ కూడా ఈ సినిమాకు ఒప్పుకున్నాడని సమాచారం. ఇక ఇది అస్సలు ఊహించని కాంబో.. దీంతో ఇదెక్కడి కాంబో రా మావా అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. మరి ఈ సినిమాతో రాజశేఖర్ హిట్ అందుకొని.. వరుస సినిమాలను అందుకుంటాడేమో చూడాలి.
