దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also : బాలీవుడ్ లో అయ్యప్ప స్వామి మహిమ… మాల వేసిన స్టార్ హీరో
షెడ్యూల్ ప్రకారం జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ‘రాధే శ్యామ్’ నిర్మాతలు చెబుతుండగా, సంక్రాంతి రేసులో ఉన్న ఇతర చిత్రాలు నాగార్జున బంగార్రాజు, డీజే టిల్లు, హీరో, 7 డేస్ 6 నైట్స్, సూపర్ మచ్చి, అతిథి దేవోభవ, రౌడీ బాయ్స్ తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు పలు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకులల్లో కూడా సందడి నెలకొంది. అలాగే రాబోయే కొద్ది నెలల్లో కోవిడ్-19 కేసులు మరింత పెరగవచ్చనే భయం మేకర్స్ లో ఉంది. అందుకే తమ సినిమాలను వచ్చే వేవ్‌కి ముందే రిలీజ్ చేయాలని నిర్మాతలు కోరుకుంటున్నారు.