Site icon NTV Telugu

మోదీగా విజయేంద్రప్రసాద్?

Rajamouli's Father Vijayendra Prasad as PM Modi

పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి

బాడీ లాంగ్వేజ్, లుక్స్ భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ నరేంద్ర మోదీపై షార్ట్ మూవీ తీయాలనుకుంటున్న ఆ యువ ఫిల్మ్ మేకర్ భారత ప్రధాని పాత్రలో నటించమంటూ విజయేంద్ర ప్రసాద్ ను సంప్రదించారట. మొదట ఈ ఆఫర్ విన్న విజయేంద్ర ప్రసాద్ ఆశ్చర్యపోయినా… ఆ తర్వాత ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాటరట. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు సొంతంగా ‘సీత’ అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Exit mobile version