NTV Telugu Site icon

SSRMB : ‘మహేశ్’ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేయనున్న రాజమౌళి.!

Samb

Samb

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు ఏ మాత్రం సమయం దొరికిన సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. అందుకే  ఇక నుంచి ఎలాంటి ఫారిన్ ట్రిప్స్ లేవు, రాజమౌళి దగ్గర మహేష్‌ బందీ అయిపోయాడు. మహేశ్ పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాను అని సింహాన్ని బోనులో బంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు జక్కన్న.

Also Read : RC 16 : రెహమాన్ ట్యూన్ కు.. రామ్ చరణ్ గొంతు తోడైతే.?

ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలైందా, లేదా అనేదే ఎటూ తేల్చుకోలేక పోతున్నారు అభిమానులు. ఇండస్ట్రీ వర్గాల్లో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. కానీ అది నిజం కాదని అక్కడ వర్క్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రాజమౌళి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి విదేశాల్లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. గతంలో కెన్యా అడవుల్లో లొకేషన్ రెక్కీ చేసిన జక్కన్న అక్కడే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అందుకే ముందుగా కెన్యా ఫారెస్ట్‌లో మేజర్ సీక్వెన్స్ షూట్ చేయనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందట. అయితే కెన్యాలో షూటింగ్ అంటున్నారు కాబట్టి, అక్కడికి వెళ్లాలంటే ఇప్పుడు రాజమౌళి లాక్కున్న మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇవ్వాల్సిందేనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.