టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్‌లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ఇటీవల విడుదలైన స్టన్నింగ్ పోస్టర్ ఇప్పటికే సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు ‘కరుణాకరుడు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించటం వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ బజ్‌ను మరింత హైప్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం, రావు బహదూర్ టీజర్‌ను ఆగస్టు 18న ఉదయం 11.07 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. అంతేకాదు..
Also Read : Naresh : పాన్ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్..
ఈ టీజర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా ఆవిష్కరించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవుతున్న వార్త బయటకు వచ్చిన వెంటనే, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సత్యదేవ్ ఇప్పటివరకు ఎన్నో వేరైటీ రోల్స్‌లో కనిపించినా, ఈసారి పూర్తిగా కొత్త డైమెన్షన్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి సత్యదేవ్–వెంకటేష్ మహా కాంబినేషన్ నుంచి ఏలాంటి మ్యాజిక్ బయటపడుతుందో చూడాలి.
