Site icon NTV Telugu

పవన్, మహేష్ బాబు లకు థాంక్స్ చెప్పిన రాజమౌళి

ss rajamouli

ss rajamouli

దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకొంటున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ని సృష్టిలో పెట్టుకొనే కొన్ని స్టార్ హీరో సినిమాలు కూడా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3 సినిమాలు ఆర్ఆర్ఆర్ కోసం వెనక్కి తగ్గాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తమ సినిమా కోసం స్టార్ హీరోలు తీసుకున్న నిర్ణయానికి రాజమౌళి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3 చిత్ర బృందాలకు థాంక్స్ చెప్తూ చిత్రాలకు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు.

https://ntvtelugu.com/did-trivikram-run-behind-the-bheemla-nayak/

ముందుగా సర్కారు వారి పాట గురించి మాట్లాడుతూ ” సర్కారు వారి పాట నిజంగా సంక్రాంతికి రావాల్సిన సినిమా .. కానీ మంచి మనసుతో అర్ధం చేసుకుని తమ సినిమాని వాయిదా వేసిన మహేష్ కి ప్రత్యేకంగా థాంక్స్.. ఇండస్ట్రీలో ఆరోగ్యరకరమైన వాతావరణానికి కారకులై చక్కని నిర్ణయం తీసుకున్న నా హీరో మహేష్ బాబు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే భీమ్లా నాయక్ ని వాయిదా వేసిన చినబాబు గారికి , పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.. మీ సినిమా మంచి ఆడాలని కోరుకొంటున్నాను అంటూ తెలిపారు. ఎఫ్ 3 వాయిదా వేసినందుకు థాంక్స్ దిల్ రాజు గారికి , చిత్ర బృందానికి ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version