సినీ అభిమానములంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక మొన్నటి వరకు చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు చేయబోయే ప్రమోషన్స్ ఒక ఎత్తు అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయనున్నారట మేకర్స్.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటివరకు అయితే అధికారికంగా చెప్పకపోయినా ఇది నిజమే అని టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. మెగా , నందమూరి అభిమానులకు పండగే పండగ,.. ఒక రకంగా చెప్పాలంటే మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ ఈవెంట్ కి వారి తండ్రులు ముఖ్య అతిధులుగా వస్తునట్లే.. చరణ్ కోసం చిరువి.. తారక్ కోసం బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారట.. ఇక ఏది కేవలం జక్కన్న చేస్తున్న మ్యాజిక్ అని తెలుస్తోంది. మరి ఒకే స్టేజిపై చిరు, బాలయ్య ఇంకోవైపు చరణ్, తారక్ .. ఆహా ఊహించుకుంటేనే ఎంత బావుంది.. నిజమైతే ఇంకెంత బావుంటుందో అని ఇప్పటినుంచే అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారట.. మరి ఇది నిజం కానుందా అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..
