Site icon NTV Telugu

Radhe Shyam : రాజమౌళి సలహా… సెన్సార్ అయ్యాక చేంజెస్ !!

Radheshyam

Radheshyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయినప్పటికీ మేకర్స్ రాజమౌళి ఇచ్చిన విలువైన సూచనలను దృష్టిలో పెట్టుకుని, ఆల్రెడీ సెన్సార్ పూర్తి చేసుకున్న ఫైనల్ కాపీలో 10 నిముషాలు ట్రిమ్ చేసినట్టు సమాచారం. సినిమా విడుదల నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

Read Also : Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్

ఈ బహుభాషా ప్రేమకథ 1970లలో యూరప్‌ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా, హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్నాడు. విక్రమాదిత్య లవర్ ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’కు… రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version