Site icon NTV Telugu

అనుకున్నదానికంటే ముందుగా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్… ఎందుకో చెప్పేసిన జక్కన్న

RRR

RRR

“ఆర్ఆర్ఆర్”ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. అయితే డిసెంబర్ 9న ఈ చిత్రం ట్రైలర్ ను ఉదయం థియేటర్లలో సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఉదయం సెలెక్ట్ చేసుకున్న థియేటర్లలో ట్రైలర్ ను లాంచ్ చేశారు. అయితే అకస్మాత్తుగా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ను సాయంత్రం కాకుండా ఉదయం 11 గంటలకే విడుదల చేయబోతున్నట్టు విడుదలకు అరగంట ముందు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఇదే విషయంపై రాజమౌళికి ప్రశ్న ఎదురైంది.

Read Also : వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు… జర్నలిస్ట్ ప్రశ్నకు రాజమౌళి కౌంటర్

ముందుగా అనుకున్నట్టుగా కాకుండా థియేటర్లలో విడుదల చేసిన కాసేపటికే ట్రైలర్ ను విడుదల చేయడానికి కారణం ఏమిటని, 11 గంటలకే ఎందుకు విడుదల చేశారు? అని రాజమౌళిని ప్రశ్నించగా… ఆయన స్పందిస్తూ “ఈ టైంకే రిలీజ్ చేయాలని మేము అనుకోలేదు. అయితే ట్రైలర్ థియేటర్లలో విడుదలైన తరువాత దానిని ఎవరైనా మంచి క్లారిటీతో యూట్యూబ్ లో విడుదల చేస్తే లాభం ఉండదు” అంటూ సమాధానం చెప్పారు. ఇక ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఇద్దరు హీరోల అభిమానులనూ అలరిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version