Site icon NTV Telugu

RRR Press Meet : ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఇది కాదట !!

RRR

RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, మరోవైపు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే రాజమౌళి మాట్లాడుతూ సినిమాకు ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఏంటి? దానిని మార్చడానికి గల కారణమేంటి ? అనే విషయాలను వెల్లడించారు.

Read Also : Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…

ముందుగా మార్చ్ 17న “ఆర్ఆర్ఆర్”ను విడుదల చేయాలని అనుకున్నారట. కానీ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ “జేమ్స్” అదే రోజు విడుదలకు సిద్ధమవ్వడంతో వెనక్కి తగ్గారట. అందుకే “జేమ్స్” సినిమాకు వారం గ్యాప్ ఇచ్చి మార్చ్ 25న వస్తున్నట్టు “ఆర్ఆర్ఆర్” మేకర్ వెల్లడించారు.

Exit mobile version