Site icon NTV Telugu

SSMB 29 : ఈవెంట్ కోసం రాజమౌళి ప్లానింగ్.. సుమ స్పెషల్ వీడియో

Globetrotter Rajamouli Update

Globetrotter Rajamouli Update

SSMB 29 : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో ప్లాన్ చేస్తున్నాడు. పాస్ పోర్ట్ లాంటి పాస్ లు పెట్టాడు. ఫిజికల్ పాస్ లు ఉన్న వారికే ఎంట్రీ ఉందన్నాడు. పకడ్బందీగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం తన టీమ్ తో స్పెషల్ గా బోర్డు మీద డీటేయిల్స్ వివరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యాంకర్ సుమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇది కదా కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Akhanda-2 : అఖండ-2 నుంచి తాండవం ఫుల్ సాంగ్ రిలీజ్

రీసెంట్ గా ఈవెంట్లలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి చాలా ప్లానింగ్ చేస్తున్నాడు. వారందరికీ ఈవెంట్ ను ఎలా కండక్ట్ చేయాలి, ఎప్పుడు ఎవరిని అలర్ట్ చేయాలి, ఫ్యాన్స్ ఎక్కడ దాకా రావాలి, గెస్ట్ లు ఎలా రావాలి, సుమ ప్రోగ్రామ్ ను ఎలా నడిపించాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ప్రోగ్రామ్ లో ఏది ఎక్కడ ఎలా ఉండాలి అన్నది దగ్గరుండి వివరించాడు రాజమౌళి. ఇందులో కీరవాణి, సుమ, బాలీవుడ్ యూట్యూబర్, ఇతర టీమ్ మొత్తం పాల్గొన్నారు.

Read Also : Babu Mohan : అది నన్ను జీవితాతం బాధిస్తోంది.. బాబు మోహన్ ఎమోషనల్

Exit mobile version