Famous Director SS Rajamouli meet Andhra Pradesh CM YS Jagan.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొన్ని పరిమితులతో టిక్కెట్ ధరలను సవరిస్తూ జీవో విడుదల చేసింది. అయితే అందులో భారీ సినిమాలు విడుదల రోజున టిక్కెట్ల రేటను పెంచుకునే సదుపాయంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలకు అవకాశం లేదు. అందుకే నిర్మాత డీవీవీ దానయ్యతో కలసి రాజమౌళి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారట.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ షోలతో పాటు టిక్కెట్ల రేటు పెంపుదలకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఇటీవల కాలంలో ‘అఖండ, పుష్ప’ వంటి సినిమాలకు అద్భుతమైన స్పందన లభించినప్పటకీ టిక్కెట్ రేట్లు తక్కువగా ఉన్న కారణంగా పలువురు పంపిణీదారులు భారీగా నష్టపోయారు. అందుకే రాజమౌళి సినిమా బడ్జెట్ గురించి, దీనికోసం ఎంత కష్టపడ్డామనే విషయం గురించి నేరుగా వివరిస్తారట. మరి ముఖ్యమంత్రి జగన్ ఆర్ఆర్ఆర్ పట్ల సానుకూలంగా స్పందిస్తారో లేదో చూద్దాం.
https://ntvtelugu.com/nara-lokesh-reacts-on-jangareddygudem-incident/
