Site icon NTV Telugu

Varanasi : వారణాసి చుట్టూ వివాదాలు.. మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన

Varanasi

Varanasi

Varanasi : రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చేసిన సరే దాని పైన పెద్దగా వివాదాలు ఇప్పటివరకు జరగలేదు. ఫ్యాన్స్ నుంచి విపరీతమైన హైప్, ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు మాత్రమే కనిపించేవి. రాజమౌళి సినిమా అంటే ఇండియన్ సినిమా ను మరో స్థాయికి తీసుకెళ్లేదిగా మాత్రమే చూస్తారు. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాపై ఎందుకో మొదటి నుంచి కాంట్రవర్సీ కనిపిస్తోంది. పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ప్రియాంక చోప్రా లుక్ చూసిన వారందరూ నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. రాజమౌళి జానపద సినిమాలను అద్భుతంగా తీయగలడు గానీ.. టెక్నాలజీ పరమైన సినిమాల్లో చాలా వీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Read Also : Akhanda 2 : అఖండ2 నుంచి మరో సాంగ్ రిలీజ్.. బాలయ్య, సంయుక్త స్టెప్పులు

ఇక మొన్న జరిగిన ఈవెంట్లో గ్లింప్స్ వీడియో లేట్ కావడం మహేష్ ఫ్యాన్స్ ని ఒకింత ఇంత నిరాశకు గురిచేసింది. ఆ క్రమంలో రాజమౌళి హనుమంతుడి పై చేసిన కామెంట్స్ మరింత రచ్చకు దారి తీసాయి. ఏకంగా సోషల్ మీడియాలో రాజమౌళిని ట్రోల్ చేసే స్థాయిలో ప్రజెంట్ సిచువేషన్ ఉంది. ఈరోజు ఏకంగా రాజమౌళి చేసిన కామెంట్స్ పై కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అటు వారణాసి టైటిల్ పై కూడా ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేయడం కనిపించింది. ఇలా ఒకేరోజు రెండు వివాదాలు ఈ సినిమా చుట్టూ కనిపించాయి. ఇప్పటివరకు రాజమౌళి ఏం చేసినా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసేవాడు. కానీ మహేష్ బాబు మూవీ విషయంలోనే ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తికి గురవుతున్నారు. మూవీ మొదట్లోనే ఇలాంటి అపశకునాలు కనిపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు కేసులపై రాజమౌళి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Read Also : Kayadu Lohar : ఆ వార్తలు చూసి ఏడ్చేశా.. కయాదు లోహర్ కామెంట్స్

Exit mobile version