NTV Telugu Site icon

SSMB 29: ఇద్దరూ ఇద్దరే! ఈయనోరకం… ఆయనోరకం

Ssmb 29

Ssmb 29

దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుదంటే చాలు… ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెక్స్ట్ మహేష్‌ బాబుతో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి కూడా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి. ప్రజెంట్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, ఫలానా సమయానికి లాక్ చేస్తారని, హాలీవుడ్ క్యాస్టింగ్ తీసుకుంటున్నారని, బాలీవుడ్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారని, స్టార్ హీరోని విలన్‌గా ఓకె చేశారని… షూటింగ్ అప్పుడేనని… ఇలా ఎన్నో రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఎన్ని వార్తలు వినిపించినా జక్కన్న నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ అవన్నీ పుకార్లు మాత్రమే . SSMB 29 గురించి ఇప్పటి వరకు రాజమౌళి చెప్పింది మాత్రం ఒక్కటే. నెక్స్ట్ మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్నాను… గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వంచర్‌ అని.. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. అంతకు మించి ఎస్ఎస్ఎంబీ 29 గురించి మరో అఫిషీయల్ అప్టేడ్ లేదు, చెబితే రాజమౌళినే చెప్పాలి లేదంటే మహేష్ బాబునే చెప్పాలి. ఈ ఇద్దరు మాత్రం భలే సైలెన్స్ ని మైంటేన్ చేస్తున్నారు.

Also Read: https://www.youtube.com/shorts/kwPLYSw7lZg

ఉన్నపళంగా మహేష్ బాబు-రాజమౌళి కలిసి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో… ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ ఉంటుందని ఆశగా ఎదురు చూశారు అభిమానులు కానీ ఇద్దరిలో ఒక్కరు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏదైనా అప్డేట్ ఉందా? అని మహేష్ బాబును యాంకర్ అడిగితే… సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. సార్ కూడా చెప్పలేదు కదా… నేను కూడా అలాగే మెంటైన్ చేస్తున్నాని చెప్పేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు కానీ మహేష్ బాబు మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో… పక్కాగా రాజమౌళిని ఫాలో అవుతున్నాడనే చెప్పాలి. లేదంటే.. ఏదో ఒక చిన్న లీక్ అయిన బయటికి వచ్చేది కాబట్టి.. మహేష్, రాజమౌళి ఎప్పుడనుకుంటే అప్పుడే ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ బయటికి రానుందని చెప్పాలి.