దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా. మరి ఇందులో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ కోసం రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. ఆ రోల్ కోసం బాలీవుడ్ నుండి..
Also Read : Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?”
స్టార్ రణబీర్ కపూర్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్వరలో తెలుస్తుంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే – తాజాగా కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు కొత్త షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. దీనికోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ వేశారని సమాచారం. ఇక కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను గురించి రచయిత విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ అభిమానులం. ఆయన పుస్తకాల ఆధారంగా ఈ కథను రాశాం” అని చెప్పారు. అంటే ఈ సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతోందని స్పష్టమవుతోంది. ఎప్పటిలాగే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథ – విజయేంద్రప్రసాద్, సంభాషణలు – దేవా కట్టా.