NTV Telugu Site icon

SIIMA 2022: బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో జక్కన్నతో పోటీలో ఆ నలుగురు కుర్ర దర్శకులు

Rajamouli Siima

Rajamouli Siima

SIIMA 2022 Best Director Nominations: ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవగా ఇప్పుడు నామినేషన్లు కూడా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ సహా మలయాళ పరిశ్రమల్లో సినీ పరిశ్రమలో ఉన్న నోటెడ్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ నేపథ్యంలో “సైమా” అవార్డుల నిర్వాహకులు బెస్ట్ సినిమాల నామినేషన్ జాబితాను ముందే ప్రకటించగా ఇప్పుడు తెలుగు సహా మిగతా బాషల్లో బెస్ట్ డైరెక్టర్ల నామినేటెడ్ లిస్టు రిలీజ్ చేశారు.

Faria Abdullah: బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సులో ‘చిట్టి’ అందాల విందు

ఇక ఈ లిస్టులో కార్తికేయ 2 సినిమాను డైరెక్ట్ చేసిన చందు మొండేటి, సీతారామం సినిమాను డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి, ఆర్ఆర్ఆర్ సినిమాను డైరెక్ట్ చేసిన రాజమౌళి, మేజర్ సినిమాను డైరెక్ట్ చేసిన శశి కిరణ్ తిక్క, డీజే టిల్లు సినిమాను డైరెక్ట్ చేసిన విమల్ లను సైమా నామినేట్ చేసినట్టు ప్రకటించింది. టాలీవుడ్ కు సంబంధించి బెస్ట్ మూవీస్ విభాగంలో రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’తో పాటు సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘DJ టిల్లు’, నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కార్తికేయ-2’, అడవి శేష్ మూవీ ‘మేజర్’, దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’ సినిమాలు బరిలో నిలివగా అదే సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లను బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు నామినేట్ చేశారు నిర్వాహకులు.

Siima

Show comments