Site icon NTV Telugu

SSMB 29:మహేష్ సినిమా కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్న రాజమౌళి…

Whatsapp Image 2023 06 25 At 4.33.01 Pm

Whatsapp Image 2023 06 25 At 4.33.01 Pm

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తరువాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా మహేష్ బాబు కు 29 వ చిత్రం అని తెలుస్తుంది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమా గ్లోబల్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్ వచ్చాయి.తాజాగా మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఎంతో బిజీగా ఉన్నాడు.అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా పనులపై కూడా దృష్టి పెట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ అంతా కూడా జులై నెల చివరకు పూర్తవనుందని సమాచారం.. నా కథ జులై నెల చివరకు పూర్తవుతుంది. ఎంతో ఎమోషన్స్‌తో కూడిన అడ్వెంచరస్‌ మరియు యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ కథ ఉండబోతుంది.సీక్వెల్‌ కు తెరతీసేలా క్లైమాక్స్‌ను ఉండబోతుందని..అని రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వీలైనంత త్వరలోనే ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం.

ఎస్‌ఎస్‌ఎంబీ 29లో మహేశ్ బాబు పాత్ర హనుమంతుని స్ఫూర్తిగా జంగిల్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో సాగనుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో నే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.ఎస్‌ఎస్‌ఎంబీ 29లో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీ గా వున్నాడు.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం.ఇటీవలే విడుదల చేసిన గుంటూరు కారం మాస్‌ స్ట్రైక్‌ అభిమానులకు బాగా నచ్చేసింది.. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని సమాచారం.. ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే మహేష్ దర్శకుడు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు.

Exit mobile version