SSMB 29:మహేష్ సినిమా కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్న రాజమౌళి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తరువాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా మహేష్ బాబు కు 29 వ చిత్రం అని తెలుస్తుంది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చాయి.తాజాగా మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఎంతో బిజీగా ఉన్నాడు.అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఎస్ఎస్ఎంబీ 29 సినిమా పనులపై కూడా దృష్టి పెట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా జులై నెల చివరకు పూర్తవనుందని సమాచారం.. నా కథ జులై నెల చివరకు పూర్తవుతుంది. ఎంతో ఎమోషన్స్‌తో కూడిన అడ్వెంచరస్ మరియు యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ కథ ఉండబోతుంది.సీక్వెల్ కు తెరతీసేలా క్లైమాక్స్‌ను ఉండబోతుందని..అని రైటర్ విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వీలైనంత త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం.
ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్ బాబు పాత్ర హనుమంతుని స్ఫూర్తిగా జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఎస్ఎస్ఎంబీ 29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.ఎస్ఎస్ఎంబీ 29లో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీ గా వున్నాడు.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం.ఇటీవలే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు బాగా నచ్చేసింది.. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని సమాచారం.. ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే మహేష్ దర్శకుడు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!