Site icon NTV Telugu

Rajamouli : అర్ధరాత్రి ఛార్మినార్ లో సందడి

Rajamouli

దర్శక దిగ్గజం రాజమౌళి అర్ధరాత్రి చార్మినార్ లో సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుకోకుండా ఆ సమయంలో, అలా రాజమౌళి కనిపించే సరికి జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రంజాన్‌ మాసం కావడంతో పాతబస్తీలో నైట్‌ బజార్‌ ప్రారంభమైంది. హైదరాబాదీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పాతబస్తీ, పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలోని నైట్ బజార్ లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కన్పించారు. తన కుమారుడు ఎస్‌ఎస్‌.కార్తికేయతో కలిసి రాజమౌళి అక్కడ రుచికరమైన బిర్యానీని టేస్ట్ చేశారు. ఇక రాజమౌళి అండ్ టీం దగ్గరకెళ్ళి కొంతమంది సెల్ఫీలు అడగ్గా… వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు రాజమౌళి.

Read Also : Narayan Das K Narang : తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మృతి

వర్క్ ఫ్రంట్‌లో రాజమౌళి ప్రస్తుతం తన మాగ్నమ్ ఓపస్ RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 1,000 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. RRR లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోషించిన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలకు అద్భుతమైన స్పందన వచ్చింది. రామ్ చరణ్ మరదలిగా అలియా భట్ నటించగా, ఎన్టీఆర్ తో హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ జతకట్టింది. డివివి దానయ్య తన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఐదు భాషల్లో నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాను ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Rajamouli

Exit mobile version