Site icon NTV Telugu

వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు. ఆయన నాకు సినిమా గురించి 20 నిముషాలు చెప్పగానే వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా…

Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి

ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక్క సినిమా గురించి చాలా టైం స్పెండ్ చేశాడు. నాకు సినిమాల విషయంలో ఎంత పిచ్చి ఉందో ఆయనకు అంతకన్నా ఎక్కువగా ఉంది. తాను చెప్తుంటే ఒక బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడని అన్పించింది. ఆయన కారణంగానే ఈ సినిమా టీంతో అసోసియేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను” అంటూ డైరెక్టర్ గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ఒక సూపర్‌హీరో చుట్టూ తిరిగే ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘బ్రహ్మాస్త్ర’లో రణబీర్, అలియా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సౌత్ సూపర్ స్టార్ నాగార్జున, ప్రముఖ నటి డింపుల్ కపాడియా, మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version