Baahubali The Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ రీ రిలీజ్ సినిమాకు భారీ క్రేజ్ వస్తోంది. రెరండు పార్టులను కలపడంతో పాటు కొన్ని కొత్త సీన్లను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి, ప్రభాస్, రానా రెడీ అయిపోయారు. ఈ ముగ్గురూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశారు. బాహుబలి సమయంలోని చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ.. పదేళ్లు అవుతోంది కదా.. మీకెలా అనిపిస్తోందని అడిగాడు. తనకు ఇప్పటికీ కొన్ని సీన్లు అలాగే మైండ్ లో ఉండిపోయాయని తెలిపాడు జక్కన్న.
Read Also : Priyanka Chopra : నల్లగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేశారు.. మహేశ్ హీరోయిన్ కామెంట్స్
మరీ ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని చంపడానికి కత్తి పట్టుకున్న టైమ్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఇప్పటికీ తన మైండ్ లో ఉండిపోయాయన్నాడు. అలాగే భళ్లాల దేవుడి విగ్రహాన్ని పైకి లేపే సమయంలో చేతులు వణికాయంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రభాస్ సభలో తల నరికే సీన్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ సీన్ మూడో రోజు ప్రభాస్ తల నరుకుతాడని రానా గుర్తు చేశాడు. అవును అది ఆ సీన్ లో చాలా బాగుంటుంది అన్నాడు రాజమౌళి. అవును అది మాట్లాడుకోవడానికి బాగుంది కానీ అంటూ ప్రభాస్ అన్నాడు. అంతకు మించి ప్రోమోలో చూపించలేదు. ముగ్గురూ ఇందులో సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఇంటర్వ్యూ బ్లాస్ట్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్
