ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు ‘ఆర్ఆర్ఆర్’ లేదు. ఆ ఇద్దరూ కమిట్‌మెంట్‌తో పని చేసిన కారణంగానే నా పని సులువు అయ్యింది. వీరిద్దరి గురించి చెప్పాలంటే.. తారక్ తన ఆలోచలకు అనుగుణంగా నటించే సత్తా ఉన్న నటుడు.. చరణ్ ఒక బ్లాంక్ పేపర్ లాంటి మైండ్ తో సెట్లోకి వచ్చిచేయగల నటుడు.. ఒకరు యాంబిషియెస్..మరొకరు మోర్ సెటిల్డ్.. ఎన్టీఆర్ తో పనిచేయడం చాలా సులువు. నేను మనసులో అనుకున్నదాన్ని సేమ్ టు సేమ్ చేయగలడు తారక్. మా ఇద్దరి మధ్య అంత కో ఆర్డినేషన్ ఉంది.
తారక్ నాకంటే సీనియర్ అని ఎప్పుడూ గొడవపడుతుంటాను. తనది చైల్డ్ మెంటాలిటీ.. తారక్ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం. తనకి అసలు టైమ్ సెన్స్ లేదని.. ఈ విషయంలో నేనెప్పుడూ తారక్‌ను తిడుతూనే ఉంటా. ఇంత కమిటెడ్ గా పని చేసే నటుడు దొరకడం నాకు, తెలుగు సినిమాకు మాత్రమే కాదు.. తెలుగు ఇండస్ట్రీ సైతం చేసుకున్న అదృష్టం. చరణ్ ని నేనెప్పుడూ నా హీరో అని పిలుస్తా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సెట్‌కి వస్తాడు.. మీకేం కావాలో చెప్పండి.. అది చేయడం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత కంఫర్టబుల్ గా ఉన్న నటుడిని నేను ఇప్పటివరకూ చూడలేదు.. చరణ్ దగ్గర నేను ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాను. తారక్ నార్త్ పోలార్ అయితే… చరణ్ సౌత్ పోలార్. ఇలాంటి భిన్న ధృవాలు కలిసి RRR ను ఈ స్థాయికి తీసుకొచ్చారు” అని చెప్పుకొచ్చారు