టాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు రీసెంట్ గా హిట్ కొట్టిన చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. వసూళ్ల పరంగాను ఈ చిత్రం జోరు చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఓటీటీ కోసం ట్రైలర్ ను విడుదల చేశారు. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్స్ గా నటించారు. రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.