NTV Telugu Site icon

చోరుడికి రాజ మార్గం! శ్రీవిష్ణు ఆనందోత్సాహం!!

మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్‌లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు.

అయితే సెకండ్ లాక్ డౌన్ తరువాత వచ్చిన చిత్రాల్లో ‘రాజ రాజ చోర’ నెల రోజులుగా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటమంటే విశేషమేనని చెప్పాలి. మొదటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడటంతో పాటుగా, పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టుకొంది. గాలిసంపత్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత శ్రీవిష్ణు వెంటనే కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, టి జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. మేఘా ఆకాష్, సునైనా, రవి బాబు, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యాంగర్ తదితర పాత్రల్లో నటించారు.

May be an image of 1 person, standing and text