Site icon NTV Telugu

‘రాజ రాజ చోర’ వారంలో ఎంత చోరీ చేశారు?

Raja Raja Chora

Raja Raja Chora

శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ వీక్ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఇది కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. అయితే ఈ వారం కూడా మరిన్ని సినిమాలు థియేటర్లోకి రానుండటంతో ‘రాజ రాజ చోర’ కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో చూడాలి!

Exit mobile version