Site icon NTV Telugu

Rahul Ravindran: సమంత నో చెప్పాకే రష్మిక ఓకే చెప్పింది – ‘ది గర్ల్ ఫ్రెండ్’ వెనుక స్టోరీ”

Samantha

Samantha

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు.

Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు..

‘ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా సమంతను అనుకున్నా.. స్క్రిప్ట్ చదివింది. కానీ ఆమెనే – ‘ఇది నా కంటే వేరే హీరోయిన్ చేస్తే బాగుంటుంది’ అని చెప్పింది. తర్వాతే రష్మిక ఫైనల్ అయ్యింది. రష్మిక రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ చదివి కాల్ చేసింది.ఇలాంటి కథను తప్పకుండా చెప్పాలి’ అని ఓకే చేసింది. ఈ కథలో అమ్మాయిలకు కనెక్ట్ అయ్యే అంశం ఉందని చెప్పింది. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పింది. కానీ రష్మిక ‘యానిమల్’ వంటి మాస్ హిట్ ఇచ్చిన తర్వాత మా సినిమా రియలిస్టిక్ లుక్‌లో ఆమెను చూపించడంపై కాస్త టెన్షన్‌గా అనిపించింది. కానీ రష్మికే ‘ఇలానే రియల్‌గా చూపించండి, ఆ క్యారెక్టర్ సౌలభ్యం అదే అని తెలిపింది. సినిమా థియేటర్‌లో చూసినప్పుడు అసలు ఎమోషనల్ కంటెంట్ అర్థమవుతుంది. ఇది ఒక లవ్ స్టోరీ అయినా, లైఫ్ రియాలిటీస్ చూపించే రియలిస్టిక్ డ్రామా. నా తదుపరి రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఆ తర్వాత రష్మికతో మరో సినిమా కూడా చేయబోతున్నాను,” అని వెల్లడించారు.

Exit mobile version