NTV Telugu Site icon

Anasuya: ‘THE’ వివాదంలోకి ఎంటర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్..

Rahul

Rahul

Anasuya: సాధారణంగా ఒక వివాదం జరిగింది అంటే.. దాన్ని కొన్నిరోజులు ట్రెండ్ చేసి వదిలేస్తారు. దాని వలన ఫేమస్ అయ్యినవాళ్లు.. మాత్రం తమకు ఎప్పుడు ఫేమస్ అవ్వాలన్నా అదే వివాదాన్ని రేపి.. మరింత ఫేమస్ అవ్వాలని చూస్తారు.. ఇది మేము అంటున్న మాట కాదు.. ట్విట్టర్ లో అనసూయ చేస్తున్న రచ్చకు నెటిజన్లు చెప్పుకొస్తున్న మాట. ఎప్పుడో అర్జున్ రెడ్డి సమయంలో విజయ్ దేవరకొండతో ఆమెకు ఉన్న విబేధాలను ఇప్పటికి కొనసాగిస్తూ.. సమయం చిక్కినప్పుడల్లా.. ఆ వివాదాన్ని రేపి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచేలా చేస్తుంది. THE అనే పదాన్ని ప్రస్తుతం ట్రెండ్ చేసిన అనసూయ.. ఇంకా విజయ్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూనే ఉంది. ఇక ఈ వివాదాన్ని విజయ్ పట్టించుకోకపోయినా విజయ్ ఫ్యాన్స్ మాత్రం అస్సలకు వదలడం లేదు. అనసూయను అసభ్యకరమైన పదాలను వాడుతూ ఏకిపారేస్తున్నారు. సాధారణంగా ఏ నటి అయినా ఆ స్థానంలో ఉంటే.. ఇంకోసారి మాట్లాడదు. కానీ, అక్కడ ఉన్నది రంగమత్త. రౌడీ ఫ్యాన్స్ వేసే ప్రతి కామెంట్ కు కౌంటర్ ఎటాక్ ఇస్తూనే ఉంది.

Rajinikanth: వారికి రజినీకాంత్ కూతుళ్లే టార్గెట్.. మొన్న పెద్దకూతురు.. నేడు చిన్న కూతురు

ఇక ఈ మధ్య ఒక నెటిజన నీ పెంపకం అలాంటింది.. అని ఇష్టం వచ్చినట్లు రాసుకొచ్చాడు. ఇక దానికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ” నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పు అవుతుంది కానీ, నేనెలా తప్పు అవుతాను.. నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా , గౌరవపూర్వకంగా చెప్పడం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి” అని చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా చూసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యాడు.. ” దయచేసి ఈ విధంగా అడుగుతున్నందుకు క్షమించదు. అసలు ఈ లొల్లి ఏంటో చెప్తారా..?” అంటూ ప్రశ్నించాడు. దానికి అనసూయ అయితే సమాధానం ఇవ్వలేదు కానీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం వదిలేయ్ అన్నా.. ఫేమస్ అవ్వడానికి స్టంట్స్ వేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి ద్వారానే రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా ఫేమస్ అయిన విషయం తెల్సిందే. మరి రాహుల్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments