Site icon NTV Telugu

Rahul Ramakrishna: లిప్‌లాక్ ఫోటోతో పెళ్లి ప్రకటన

Rahul Ramakrishna Marriage

Rahul Ramakrishna Marriage

కమెడియన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా వెల్లడించాడు. తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్ళి విషయాన్ని రాహుల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజానికి.. రాహుల్ ప్యాండెమిక్‌కి ముందే తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అప్పుడు కుదరకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, పెళ్లికి సిద్ధమయ్యాడు.

రాహుల్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు బిందు. ఈమె ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వీళ్లిద్దరు ఒక పార్టీలో కలుసుకున్నారు. పార్టీ అయ్యాక బిందునే రాహుల్‌ని ఇంటి వద్ద డ్రాప్ చేసింది. ఈ రైడ్ నుంచే వీరి రిలేషన్‌షిప్ ప్రారంభమైంది. వ్యక్తిగతంగా గానీ, వృత్తిపరంగా గానీ.. తమ అభిప్రాయాలు చాలా కలుస్తాయని, తాము చాలా త్వరగా దగ్గరయ్యామని రాహుల్ చెప్పాడు. ఈ నటుడు ఇంతకుముందెన్నడూ ఆమె ఫోటోని షేర్ చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత తొలిసారి, అది కూడా లిప్‌లాక్ ఫోటోతో తన ఫియాన్సీని ప్రపంచానికి పరిచయం చేశాడు.

Exit mobile version