Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు తన కెరీర్లో 30వ సినమాను ప్రకటించడంతో పాటు ఊహించని ట్విస్ట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇప్పటివరకు తన సినిమాలకు ఎక్కువగా తానే దర్శకత్వం వహించిన లారెన్స్, ఈసారి మాత్రం ఓ కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు. గ్రూప్ డాన్సర్‌గా ప్రయాణం ప్రారంభించిన రాఘవ లారెన్స్, స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన తర్వాత నటుడిగా, దర్శకుడిగా కూడా విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కించిన ‘మాస్’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘కాంచన’ సిరీస్‌తో హారర్ కామెడీ జానర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చి వరుస విజయాలు సాధించారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరచుకున్న లారెన్స్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఒకవైపు పూజా హెగ్డేతో ‘కాంచన 4’ను తెరకెక్కిస్తూనే, మరోవైపు స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘బెంజ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్యే తన సొంత నిర్మాణ సంస్థపై కొత్త సినిమాను ప్రకటించడం విశేషంగా మారింది. అయితే ఇది ఆయన కెరీర్లో 30వ చిత్రం కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సినిమాలో తోడుగా పుగళ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారు లారెన్స్. ఇప్పటికే విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన లారెన్స్, ఒక కొత్త వ్యక్తితో దర్శకత్వ బాధ్యతలు పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్ మరోసారి అదే ఆలోచనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రస్తుతం దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి తారాగణం, సాంకేతిక బృందంతో పాటు ప్రత్యేక అనౌన్స్మెంట్ ను ఈ నెల 12న విడుదల చేయాలని చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హారర్ కామెడీలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్, ఈ కొత్త దర్శకుడి కాంబినేషన్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
- Rishab Shetty: 'జై హనుమాన్' తర్వాతే శివాజీ.. 'కాంతార 2'పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Tags
- cinema
- Raghava Lawrence
తాజావార్తలు
-
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
-
Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!
-
Crude Oil: ఇరాన్‌పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్‌లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
-
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్‌లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!