టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. ఆఖరికి డిజాస్టర్ సినిమాలు కూడా రీరిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలి అనుకున్నారు.
Also Read : SANKRANTHI 2025 : జనవరి 9న రెబల్ స్టార్ vs TVK విజయ్
ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ కు దాదాపు ఎండ్ కార్డ్ వేసే పరిస్థితి వచ్చింది. నేడు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఆయన నటించిన రగడ సినిమాను 4K క్వాలిటీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా బుకింగ్స్ డిజాస్టర్ స్థాయిని తలపించాయి. వైజాగ్ వంటి మెయిన్ స్టేషన్స్ లో సంగం, శరత్ లాంటి థియేటర్స్ లో కేవలం 25 % మాత్రమే బుకింగ్స్ జరిగాయి అంటే అర్ధం చేసుకోవచ్చు రగడ ఎంతటి డిజాస్టర్ అనేది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓవరాల్ గా రగడ 4K డిజాస్టర్ అనే చెప్పాలి. ఇక నుండైనా కొన్నాళ్ల పాటు ఈ రిలీజ్ కు కాస్త బ్రేక్ ఇవ్వాలి. లేదా పూర్తిగా ఆపేయాలి అనే ట్రేడ్ నుండి వినిపిస్తున్న మాట. అన్నట్టు రేపటి నుండి మూడు రోజుల పాటు పవర్ స్టార్ తమ్ముడు సినిమా రీరిలీజ్ కాబోతుందండోయ్