టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత సిరివెన్నలే సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయనను కడచూపు చూడడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కదలివచ్చింది. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం కారణంగా పలు సినిమా అప్డేట్ ని వాయిదా వేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని వాయిదా వేసిన జక్కన్న కొత్త డేట్ ని త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ టీమ్ సైతం సిరివెన్నెల మృతి కారణంగా డిసెంబర్ 1 న విడుదల కావాల్సిన ‘నగుమోము తారలే’ పాటను రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు సినిమా అప్డేట్స్ వాయిదా పడితే ట్రోల్ చేసే అభిమానులు సైతం సిరివెన్నెల మృతి కారణంగా వాయిదా పడిందని తెలిసి మౌనం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కాకంకాగా జనవరి 14 న విడుదల కానుంది.