ప్రస్తుతం చిత్రపరిశ్రమలో సినీఅభిమానులందరు ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా హిందీలో రెండో సింగిల్ కి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఎప్పుడైతే హృదయం బద్దలవుతోందో.. అది తన సొంత పాటను పాడుతోంది.. అంటూ మేకర్స్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.
‘సోచేలియా’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే సాడ్ సాంగ్ లా కనిపిస్తోంది. విరహ వేదనలో ప్రభాస్, పూజా ప్రేమ జ్ఞాపకాలను నెమరువేసుకొంటూ కనిపించారు.ఈ సాంగ్ లోనూ అదిరిపోయే విజువల్స్ ని చూపించాడు దర్శకుడు రాధాకృష్ణ. ఈ ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 8 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ లో డార్లింగ్ లుక్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి. ఇకపోతే తెలుగు, తమిళ్ , మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
