‘ఆర్ఆర్ఆర్’ బాటలో ‘రాధేశ్యామ్’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను మరోమారు వాయిదా వేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ ట్రెండ్ అవుతోంది కూడా. ‘రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడిందని, ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వెండితెర పైకి రాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా క్షీణిస్తున్న కోవిడ్ పరిస్థితి సినిమా వాయిదా వేయడానికి కారణమని అంటున్నారు.
Read Also : బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
అయితే అదే సమయంలో ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రానుందని ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ధృవీకరిస్తున్నారు. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా మేకర్స్ మాత్రం సినిమా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంటూ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాయిదా పుకార్లు దావానంలా వ్యాపిస్తున్నాయి. మేకర్స్ ప్రమోషనల్ ప్రచారాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమా విడుదలకు ఇంకా ఎక్కువ లేదు. కేవలం 10 రోజులే ఉంది. కానీ మేకర్స్ ఏమాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. అంతేనా… టాలీవుడ్ లోని చిన్న సినిమాలన్నీ ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల తేదీన సైతం వరుసగా రిలీజ్ కు సిద్ధమవ్వడం కూడా ఈ రూమర్స్ కు ఒక కారణం అని చెప్పొచ్చు. మరి ఈ రూమర్స్ కు చెక్ పెట్టే విధంగా మేకర్స్ ఏదన్నా ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తారా ? లేదంటే సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారా ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!