Site icon NTV Telugu

RadheShyam: అప్పుడే ఓటిటీకి రానున్న రాధేశ్యామ్.. ఎందులో అంటే..?

radhe shyam

radhe shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటిటీలోకి రానున్నదనే వార్త ప్రస్తుతం నెట్టింట ఓరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ అమెజాన్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజైన 4 వారాల తరువాత.. అంటే ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ చేయనున్నారట.. అందుతున్న సమాచారం బట్టి ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో.. ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉన్నారట అమెజాన్ యాజమాన్యం. ఒక వేళ ఇది కాకపోతే ఏప్రిల్ 11 లోపు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట.. మరి ఇందులో నిజమెంత ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Exit mobile version