మూడేళ్ల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమాదిత్య పామిస్ట్ గా కనిపించనున్న సంగతి తెల్సిందే. మొదటి ట్రైలర్ లో ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించిన మేకర్స్ .. సెకండ్ ట్రైలర్ లో మొత్తం విక్రమాదిత్య సక్సెస్ ని చూపించారు.
మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి అని ప్రభాస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. 1 నిమిషం 3 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో విక్రమాదిత్య చెప్పే హస్త సాముద్రికం ఏ రేంజ్ లో నిజమవుతుందో చూపించారు.ఇక చివర్లో ఇంత గొప్పగా చెప్పే పామిస్ట్ తన ప్రేమ విషయంలో తప్పుగా ఆలోచించాడు అని ప్రేరణ చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగించింది. ఇక ఆ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొత్తానికి సెకండ్ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక ముందు నుంచి చెప్తున్నట్లే ప్రేమకు, విధికి మధ్య భీకర యుద్ధం అంటూ చివర్లో చెప్పి ట్రైలర్ ని ఎండ్ చేశారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి మ్యాజిక్ చేయనున్నాడా..? లేదా..? అని చూడాలి.
