అందరి దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా ప్రేమ కథ ‘రాధేశ్యామ్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ సినిమాలో కన్పించిన అందమైన ప్రదేశాల గురించి మాత్రం చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సినిమాలో ప్రేరణ పాత్రలో కన్పించిన పూజాహెగ్డే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ‘రాధే శ్యామ్’లోని ‘ఆషికి ఆ గయీ’ పాటను గడ్డకట్టించే చలిలో చిత్రీకరించారని, సహనటుడు ప్రభాస్‌తో కలిసి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను భరించవలసి వచ్చిందని వెల్లడించింది. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రబాస్, పూజా హెగ్డే వర్షంలో మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ పాటను ఇటలీలోని హిల్ స్టేషన్‌లో చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయట.
Read Also : Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
ఇక సినిమాలో ప్రేరణ పాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఇక పూజాహెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భాయిజాన్’, రణవీర్ సింగ్ సరసన ‘సర్కస్’, రామ్ చరణ్‌తో ‘ఆచార్య’, మహేష్ బాబు సరసన ‘SSMB28’తో సహా పూజా తన రాబోయే సినిమాలకు సిద్ధమవుతోంది.
