“రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను పలు వాయిదాల అనంతరం 2022 జనవరి 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఒకసారి కరోనా కారణంగా ‘రాధేశ్యామ్’ విడుదలలో ఆలస్యం జరిగింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించినప్పటికీ భారీ సినిమాల క్లాష్ కారణంగా ‘రాధేశ్యామ్’ మరోసారి వాయిదా అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలన్నీ కొట్టి పారేస్తూ ‘రాధేశ్యామ్’ జనవరి 14న కన్ఫర్మ్ చేశారు చిత్ర నిర్మాతలు. అయితే అంతా ఓకే అనుకుని, సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తోంది.
Read Also : సినిమా టికెట్లపై కూడా రాజకీయం.. వాళ్లంతా పేదలకు శత్రువులే..!
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా ఢిల్లీలో థియేటర్లు మూసివేశారు. ముఖ్యంగా ఢిల్లీలో, మహారాష్ట్రలోని ముంబై, కర్ణాటక, తమిళనాడులో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు కేవలం 50% ఆక్యుపెన్సీ ఉండడంతో ‘రాధేశ్యామ్’ వెనక్కి తగ్గుతుందని తాజాగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి ‘హ్యాపీ న్యూఇయర్’ కంటే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ అంటూ ట్రెండ్ అవుతోంది. అయితే గాసిప్స్ అన్నింటికీ చెక్ పెట్టేశారు ‘రాధేశ్యామ్’ మేకర్స్. తాజాగా రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్ ను విడుదల చేసి సినిమా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం చేస్తున్న అందరి నోళ్లను మూయించారు.
తాజావార్తలు
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!