Site icon NTV Telugu

‘రాధేశ్యామ్’ కథకు 18, తీయడానికి 4 ఏళ్ళు… డైరెక్టర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘రాధేశ్యామ్’ జనవరి కానుకగా విడుదల కానుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీగా ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ “సినిమా తీయడానికి నాలుగేళ్లు… రాయడానికి 18 ఏళ్ళు పట్టింది. ఈ పాయింట్ ను మా గురువు చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర విన్నాను. ఆ టైంలో యేలేటి గారు ఇది జాతకాల గురించి రాస్తున్నాము. ఎవరికీ రాసి పెట్టి ఉందో అన్నారు. 18 ఏళ్ళు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రైటర్స్ తో రాయించాము. కానీ కంక్లూజన్ మాత్రం దొరకలేదు. అయితే ఆయనకు కథ ఛాలెంజింగ్ గా ఉండాలని భావించి కథను రాసి ఆయనకు విన్పించాను. ఇది ప్రభాస్ గారికి రాసి పెట్టి ఉంది.

https://ntvtelugu.com/siddharth-sensational-comments-on-ap-tcket-rates-issue/

ఒక ఫిలాసఫీని ఒక కథల రాసి ఆయనకు చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. ఈ సినిమాలో ఫైట్లు, ఛేజ్ లు ఉండవు… ఒక అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి. ఒక అమ్మాయి కోసం అబ్బాయి సప్త సముద్రాలు ఇది ముందుకెళ్ళే జర్నీ, ప్రేమకథ. ప్రభాస్ గారు చెప్పినట్టు ఇట్స్ బియాండ్ యువర్ అండర్ స్టాండింగ్… ట్రైలర్ జస్ట్ ఇన్విటేషన్ మాత్రమే. 4 ఏళ్ళు సపోర్ట్ చేసిన చిత్రబృందానికి ధన్యవాదాలు” అని అన్నారు.

https://www.youtube.com/watch?v=jq54dEUdfeM
Exit mobile version