NTV Telugu Site icon

Yodha OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాశిఖన్నా యాక్షన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Yoda

Yoda

హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తుంది.. ఇటీవల నటించిన భారీ యాక్షన్ మూవీ యోధ.. థియేటర్లలో రిలీజ్ అయి నలభై రోజులు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది..శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సరికొత్తగా వచ్చిన ఈ కథ ప్రేక్షకులను అలరించలేక పోయింది… దాంతో ఇప్పుడు ఇక్కడ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన యోధ లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు. రాశీఖన్నాతో పాటు దిశాపటానీ హీరోయిన్లుగా కనిపించారు. భారీ బడ్జెట్‌తో కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు చాలా రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఇక్కడ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. దేశంను నాశనం చెయ్యాలని టెర్రరిస్ట్‌లు చేస్తోన్న కుట్రలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యోధ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు.. ఈ ఫోర్స్ లో లీడ్ గా హీరో నటిస్తాడు.. రాశి ఖన్నా భార్యగా నటిస్తుంది.. టెర్రరిస్ట్‌లు ఒక ఫ్లైట్ ను హైజాక్ చేస్తారు.. ఎలా వారి నుంచి జనాలను రక్షిస్తారు అనేది ఈ సినిమా కథ.. ఈ సినిమా హిట్ అవ్వకున్నా రాశి ఖన్నాకు మాత్రం మంచి పేరును అందించింది. దాంతో మరో రెండు ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Show comments