తాజాగా ఓజి తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తదుపరి చిత్రాలు కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకీ పెరుగుతోంది. పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read : Kalki2898AD : కల్కి సీక్వెల్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ చేస్తున్న నాగ్ అశ్విన్?
రాశి మాట్లాడుతూ.. “హరీష్ శంకర్ గారు ఫోన్ చేసి, ‘పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంది, చేస్తావా?’ అని అడిగారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాను. కథ వినకుండానే సైన్ చేసిన సినిమా అంటే ఇదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌తో నటించడం నా డ్రీమ్. ఆ కల ఇప్పుడు నెరవేరుతోంది” అంటూ రాశి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న పవన్ అభిమానులు సోషల్ మీడియాలో #UstaadBhagatSingh హ్యాష్‌ట్యాగ్‌తో జోరుగా ట్రెండ్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ వ్యక్తిత్వం గురించి కూడా రాశి ఘాటుగానే చెప్పింది. “ఆయన పేరు లాగే ఆయన స్వభావం కూడా పవర్‌ఫుల్. ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో పుస్తకాలు చదివి, ప్రతి విషయం లోతుగా అర్థం చేసుకుంటారు. ఆయనతో పనిచేయడం వలన నాకు నిజమైన మానవత్వం ఏంటో అర్థమైంది” అని రాశి చెప్పింది. అభిమానులు అయితే ఆమె మాటలను కోట్స్‌గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్ట్ షూట్ కంప్లీట్ అవ్వగా, రాశి షూట్ మాత్రం ఇంకా కొనసాగుతోంది.
