NTV Telugu Site icon

Raashi Khanna: హమ్మయ్య.. అమ్మడి లిప్ కిస్ ఇప్పటికి వర్క్ అవుట్ అయ్యింది

Vijay

Vijay

Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఢిల్లీ భామ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండి పోయింది. ఇక ఈ సినిమా తరువాత కుర్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక గత కొన్నేళ్లుగా రాశీకి ఆశించిన విజయాలు అందడం లేదన్నది వాస్తవం. ఎంత గ్లామర్ ఒలకబోసినా రాశీకి మాత్రం ఒరిగింది కూడా ఏమి లేదు. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ లో నటించినా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఆ తరువాత బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ బక్కచిక్కి కనిపించింది. సన్నజాజి తీగలా మారాక అయినా రాశీ లక్ మారుతుంది అనుకున్నారు కానీ అది కూడా సెట్ కాలేదు. పోనీ బాలీవుడ్ లో కాలు పెడితే అక్కడైనా లక్ ఉంటుందేమో అని అజయ్ దేవగణ్ సరసన రుద్ర వెబ్ సిరీస్ లో నటించింది. ఇక అది కూడా అంతంత మాత్రంగానే నిలిచింది.

Tarakaratna: తారకరత్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..?

కెరీర్ మొత్తం ఒడిదుడుకుల మధ్య నడుస్తున్న రాశీకి రాజ్ అండ్ డీకే రూపంలో ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ సిరీస్ తీసిన ఈ దర్శకులు తమ తదుపరి సిరీస్ ఫర్జీ లో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా రాశీని ఎంపిక చేశారు. ఇక ఈ మధ్యనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అందులో మేఘ అనే ఆర్బీఐ ఆఫీసర్ గా రాశీ నటన అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇందులో నటనతో పాటు రాశీ లిప్ లాక్ కు కూడా ఓకే చెప్పేసింది. మొదటి నుంచి ఆమె లిప్ లాక్ లకు ఏ రోజు నో చెప్పింది లేదు. అయితే రాశి లిప్ లాక్ ఇచ్చిన సినిమాలు అన్ని ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అమ్మడికి లిప్ లాక్ వర్క్ అవుట్ అవ్వలేదని ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఈసారి రాశీ లిప్ లాక్ వర్క్ అవుట్ అయ్యింది. షాహిద్ తో ఈ చిన్నది పెదవి పంచుకోవడం సిరీస్ కే హైలైట్ గా నిలిచింది. దీంతో అక్కడ వర్క్ అవుట్ అవ్వలేదు కానీ ఇక్కడ మాత్రం బాగా వర్క్ అవుట్ అయ్యిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఏమైంది.. ఇన్నేళ్లు ఓపిక పట్టినందుకు రాశీకి బాలీవుడ్ లో మంచి విజయం దక్కింది. ఈ విజయం తరువాత ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో వెలిగిపోతుందని అంటున్నారు. మరి ఈ లక్ ను అమ్మడు ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.