Site icon NTV Telugu

Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..

Narayana Murthy

Narayana Murthy

Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్‌ లీక్‌)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో చూపించానన్నారు. విద్యను పేద విద్యార్థులకు దగ్గర చేయడానికి.. దాని అవసరాన్ని చూపించేందుకు ఈ మూవీ తీస్తున్నట్టు తెలిపారు నారాయణ మూర్తి. మన దేశంలో చాలా ఎగ్జామ్స్ లో కాపీయింగ్ జరుగుతోందన్నారు మూర్తి.

Read Also : Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..

కాపీయింగ్ అనేది అణుబాంబు కన్నా ప్రమాదం. కొన్నేళ్లుగా మన రాష్ట్రంలోనూ పేపర్ లీకులు జరుగుతున్నాయి. గ్రూప్-1 స్థాయి ఎగ్జామ్స్ కూడా లీక్ అయితుంటే మన విద్య ఏ స్థాయిలో ఉందో మనకు అర్థం అవుతోంది. ఈ కాపీయింగ్ అనేది చాలా ప్రమాదం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూసి రాసిన వాళ్లు డాక్టర్లయితే రోగులు బతుకుతారా.. ఒకవేళ కాపీ కొట్టిన వాల్లు ఇంజినీర్లు అయితే వాల్లు కట్టిన బిల్డింగులు కూలిపోకుండా ఉంటాయా.. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తే ఎంతో కొంత అవగామన వస్తుందనేది నా అభిప్రాయం అంటూ చెప్పారు నారాయణ మూర్తి.

Read Also : Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..

Exit mobile version