Site icon NTV Telugu

Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్

Narayana Murthy

Narayana Murthy

Kota Srinivas Death : కోట శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ మృతదేహానికి ఆర్.నారాయణ మూర్తి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను, కోట శ్రీనివాస్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చాం. ఆ తర్వాత కోట శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వందలాది సినిమాల్లో నటించారు. నటనలో ఆయనకు తిరుగు లేదు. నవరసాలు పండించిన నటుడు ఆయన. ప్రతిఘటన సినిమా నటనతో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాడు.

Read Also : Babu Mohan : కోటన్న వెళ్లిపోయాడు.. లైవ్ లో ఏడ్చిన బాబు మోహన్..

కైకాల సత్యనారాయణ, రాజనాల, రావు గోపాలరావు, అలాగే ఒక కోట శ్రీనివాసరావు వీళ్లంతా ఒక శకం. కోట మరణంతో ఒక శకం ముగిసింది. అలాంటి నటుడు మళ్లీ ఇండస్ట్రీకి రాలేడు. అలాంటి నటుడిని కోల్పోవడం బాధాకరం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నారాయణ మూర్తి.

Read Also : Kota Srinivas Death : కోట శ్రీనివాస్ కు ఎన్టీఆర్, మహేశ్ సంతాపం..

Exit mobile version