ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17న థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయమే ఉండడంతో “పుష్ప”కి తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా “పుష్ప” స్పెషల్ ఈవెంట్ కు స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. సినిమాపై మరింత హైప్ ని పెంచేందుకు సుకుమార్ అండ్ టీం ప్రమోషన్ కార్యక్రమాలను భారీ రేంజ్ లో మొదలుపెట్టబోతున్నారు.
Read also : దాడి వార్తలపై హైపర్ ఆది స్ట్రాంగ్ కౌంటర్.. డబ్బులు ఎంత కావాలి అంటూ
అందులో భాగంగానే డిసెంబర్ 3వ తేదీన దుబాయ్‌లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్ట్ కు సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు.
