మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్ నుండి అల్లు అర్జున్ చెప్పిన రాయల సీమ యాస డైలాగ్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ ‘ఇంతకు ముందో టూ వీలర్ స్కూటర్ మాట్లాడుల్లా. నేనో యాపారం చేసే దానికి తిరుపతి నుంచి వచ్చుందాం’ అనే డైలాగ్ చెప్పడం ఉందట. ఈ డైలాగ్ లీకైనందుకు చిత్రబృందం తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ‘పుష్ప’ అభిమానులు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా లీక్ అవుతున్నాయి అంటే మీ చిత్రబృందంలోనే ఎవరో లీక్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం “రాయలసీమ యాసలో ఆ డైలాగ్ ఉందిరా చారి” అంటూ తమ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు.
Read Also : కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
అల్లు అర్జున్ డైలాగ్స్ అందరిని థ్రిల్ చేస్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు సినిమాకు నష్టం కలిగిస్తాయి. మేకర్స్ పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సినిమా నుంచి ఇలా వరుసగా లీకులు కావడంతో ఫిల్మ్ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. “దాక్కో దాక్కో మేక” అనే సాంగ్ లీక్ అయిన తర్వాత మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ లీకు రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ రష్మిక మందన్నతో రొమాన్స్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!