కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్

గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సమంత నెక్ట్స్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం “శాకుంతలం” సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అందులో నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సామ్ రెండు హిందీ సినిమాలకు గ్రీన సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తుండగా, మరోవైపు డివోర్స్ రూమర్స్ తో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

Read Also : ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్

ఓ బేబీ, మజిలీ, యూ టర్న్ వంటి చిత్రాలలో అద్భుతమైన తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన సామ్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇటీవల ఇంటర్వ్యూలో చిన్న గ్యాప్ తీసుకోవాలని చెప్పిన సామ్ తాజాగా ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. మరోవైపు రెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని ఓ హోటల్ జరిగిన స్పాన్సర్డ్ షూట్ లో సమంత దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Image
Image
Image
Image

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-