అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంటుంది. ఎక్కడా తగ్గేదేలే అనుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సక్సెస్ ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. అన్ని జిల్లాలో పుష్ప సక్సెస్ పార్టీని విజయవంతముగా నిర్వహించిన మేకర్స్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో తమ విజయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప’ డైరెక్టర్స్ పార్టీ పేరుతో అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరు హాజరయ్యారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, రాధా కృష్ణ కుమార్, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్, మున్నా, సంపత్ నంది, ఇంద్రగంటి మోహనకృష్ణ, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా రష్మిక, అనసూయ కనిపించి మెప్పించారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
